హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు మెదక్‌లో కాంగ్రెస్ కీలక భేటీ

MDK: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం రేపు మెదక్‌లో జరగనుంది. సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరుకానున్నారు. మంత్రులు దామోదర్ రాజనర్సింహా, వివేక్, ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్యే రోహిత్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ పాల్గొననున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది.