హైదరాబాద్: 28°C
తెలంగాణ

7 శతాబ్దాల అద్భుతం.. పిల్లలమర్రి

MBNR: జిల్లాకు ముఖద్వారంగా నిలిచే పిల్లలమర్రి సుమారు 700 ఏళ్ల చరిత్ర కలిగిన అరుదైన మహావృక్షం. 3 ఎకరాలకు పైగా విస్తరించి చిన్న కొండలా కనిపించే ఈ మర్రిచెట్టు ఆసియాలోనే అతిపెద్ద వృక్షాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. పిల్లలమర్రి ఆవరణలోని మ్యూజియం, మినీ జూ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి ప్రసాదించిన ఈ అద్భుత వారసత్వ సంపద పాలమూరు సొంతం.