హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధిక ధరకు ఎరువుల విక్రయం.. లైసెన్స్ సస్పెన్షన్

ADB: ఎంఆర్‌పీ కంటే అధిక ధరకు ఎరువులు విక్రయించిన ఉట్నూరులోని శ్రీనివాస ఫర్టిలైజర్స్‌పై వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. 28-28-0 ఎరువును అధిక ధరకు విక్రయించినట్లు నిర్ధారణ కావడంతో సంస్థ ఎరువుల విక్రయ లైసెన్స్‌ను 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఎరువులను నిర్ణయించిన ధరలకే విక్రయించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.