హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

BHNG: వలిగొండ పట్టణంలో ఈ రోజు నిర్వహించిన సామూహిక బోనాల మహోత్సవంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు.