హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందుతుంది'

VZM: తెర్లాం శాఖా గ్రంథాలయంలో ఆదివారం “చదవడం మాకిష్టం” కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలని గ్రంథాలయ అధికారి సిహెచ్. కృష్ణమూర్తి తెలిపారు. ఫ్రెంచ్ జానపద కథలు, కాలం చెప్పిన కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, నెహ్రూ, అబ్రహం లింకన్ జీవిత చరిత్రలను విద్యార్థులతో చదివించారు. అనంతరం క్విజ్ పోటీలు నిర్వహించారు.