హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యల పరిష్కారం పోరాటాలతోనే సాధ్యం: సీఐటీయూ

GDWL: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలతోనే హక్కులను సాధించుకోగలమని సీఐటీయూ నేతలు ప్రసాద్, పుట్టా ఆంజనేయులు స్పష్టం చేశారు. ఆదివారం గద్వాల భీమ్‌నగర్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతుల్లో వారు మాట్లాడారు. కార్మికుల ఐక్యతను దెబ్బతీసే నయా ఉదారవాద విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.