హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటో చార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ: మంత్రి

SDPT: 2015 తర్వాత ఆటో చార్జీలు పెరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆయన కోహెడలో మాట్లాడుతూ.. పెరిగిన ఇంధన, వాహన నిర్వహణ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని చార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. కమిటీలో ఆటో కార్మికులు, రవాణా శాఖ అధికారులు, సంబంధిత వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించి న్యాయమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.