హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్త స్మశాన వాటికలో నీటి వసతి కరవు

KDP: మైదుకూరు (M) డాయాం ఖాన్‌పల్లెలో రూ.20 లక్షలకు పైగా వెచ్చించి ఇటీవల నిర్మించిన నూతన స్మశాన వాటికలో నీటి వసతి లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దహన సంస్కారాల అనంతరం కాలకృత్యాలు తీర్చుకోవడంతో పాటు ఇతర అవసరాలకు నీరు అందుబాటులో లేక అవస్థలు పడుతున్నామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నీటి వసతి కల్పించాలని వారు కోరుతున్నారు.