నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో రాయలసీమ జోనల్ స్థాయి తైక్వాండో పోటీలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ టైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ రామకృష్ణారెడ్డి, ఎల్.టీ.చంద్రమౌళి, షేక్ రియాజ్ తదితరులు పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, తైక్వాండోతో విద్యార్థులకు శారీరక, మానసిక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాయలసీమ జోనల్ తైక్వాండో పోటీలు ప్రారంభం!


