కొలంబోలో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అదరగొట్టాడు. 168 బంతుల్లో 10 ఫోర్లతో సెంచరీ పూర్తి చేశాడు. తొలి టెస్టులోనూ 167 పరుగులతో సత్తా చాటిన పడిక్కల్, రెండో టెస్టులోనూ దూకుడుగా ఆడుతున్నాడు. రిషబ్ పంత్ 3 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. 70.3 ఓవర్లకు భారత్ 259/3తో పటిష్ఠంగా ఉంది.
క్రీడలు
పడిక్కల్ కిరాక్ సెంచరీ


