హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జీవో నెంబర్ 97పై ప్రభుత్వం పునరాలోచించాలి'

KMM:  పాలిటెక్నిక్ విద్యను SHAKTI లో విలీనం చేసే అంశంపై ప్రభుత్వం పునరాలోచించాలని మాల జన సమితి పినపాక నియోజకవర్గ అధ్యక్షుడు చెట్టి సురేష్ ఇవాళ ప్రభుత్వాన్ని కోరారు. పాలిటెక్నిక్ విద్య ద్వారా విద్యార్థులు తక్కువ సమయంలో సాంకేతిక నైపుణ్యాలు పొందడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సాధించి త్వరగా జీవితంలో స్థిరపడే అవకాశం ఉందన్నారు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకోవద్దన్నారు.