హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి రోడ్డుకు మరమ్మతులు

MBNR: బాలానగర్ మండలం జాలుగడ్డ గ్రామపంచాయతీలో మట్టి రోడ్డుకు ఆదివారం మరమ్మతులు చేపట్టారు. సామాజిక కార్యకర్త జర్పుల భాస్కర్ నాయక్ ఆధ్వర్యంలో గుంతలను పూడ్చారు. రోడ్డు సమస్యతో ఇబ్బంది పడుతున్న వాహనదారుల కోసం చేపట్టిన పనులకు తండావాసులు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ రాము నాయక్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.