హైదరాబాద్: 28°C
తెలంగాణ

చండ్రుగొండలో ఎమ్మెల్యే విస్తృత పర్యటన

ఉమ్మడి ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలంలోని గుర్వాయిగూడెం, రావికంపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదివారం పర్యటించారు. గుర్వాయిగూడెంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. రావికంపాడులో బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న పలువురిని పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.