హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి'

ASF: తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కాగజ్ నగర్ మండలం సార్సాల సర్పంచ్ కొండగుర్ల ప్రకాశ్ కోరారు. ఆదివారం మాట్లాడుతూ వినాయక విగ్రహం ఏర్పాటు స్థలం, వీధి దీపాలను పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో దాగం రాజు కుటుంబ సభ్యులతో పాటు పలువురు దాడి చేశారని ఆరోపించారు. సర్పంచ్‌గా ఎన్నికైనప్పటి నుంచి తనను వేధిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందన్నారు.