హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిట్లం మార్కెట్‌ మాజీ ఛైర్మన్‌ మృతి

KMR: నిజాంసాగర్‌ మండలం నర్సింగ్‌రావుపల్లి గ్రామానికి చెందిన పిట్లం మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ గైని విఠల్‌ ఆదివారం సాయంత్రం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను ఆదివారం మధ్యాహ్నం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. విఠల్‌ మృతితో మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి.