హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మోస్తరు వర్షం.. రైతుల్లో ఆనందం

SRD: కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆదివారం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం నుంచే మేఘావృతమైన వాతావరణం నెలకొనగా, వర్షంతో ఖరీఫ్ సాగుకు ఊరట లభించిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మరిన్ని భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండితే సాగుకు మరింత ప్రయోజనం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.