హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోనాల పండుగ నేపథ్యంలో వీధిలైట్లు ఏర్పాటు

NGKL: తాడూరు మండలంలోని సిర్సవాడ గ్రామంలో బోనాల పండుగ నేపథ్యంలో ఆదివారం 21 వీధిలైట్లు ఏర్పాటు చేశారు. సర్పంచ్ వాస శ్రీదేవి ఆధ్వర్యంలో 5వ వార్డు సభ్యుడు జల్లి పరశురాములు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. వీధిలైట్ల ఏర్పాటుకు రూ.60 వేల వ్యయం చేసినట్లు తెలిపారు. ప్రజల అవసరం, విజ్ఞప్తి మేరకు ప్రజా శ్రేయస్సు దృష్ట్యా లైట్లు ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ పేర్కొన్నారు.