WNP: కానాయపల్లి స్టేజీ సమీపంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకోటిలింగేశ్వరదత్త దేవస్థానంలో ఆదివారం ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని మహామృత్యుంజయ సహిత ద్వాదశ జ్యోతిర్లింగాలకు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తులు పంచామృతాలు, భస్మగంధ, కుంకుమ జలాలతో అభిషేకం చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించి మహామంగళహారతి నిర్వహించారు.
తెలంగాణ
VIDEO: లింగేశ్వరదత్త దేవస్థానంలో ప్రత్యేక పూజలు


