SDPT: హుస్నాబాద్ మండలంలోని మాలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన అభయాంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 24 నుంచి 26 వరకు విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ బత్తుల మల్లయ్య తెలిపారు. 24న గణపతి పూజ, అగ్ని ప్రతిష్ట, 25న హోమాలు, నవకలశ స్థాపన, 26న విగ్రహం, నవగ్రహాలు, ధ్వజస్తంభ ప్రతిష్ట నిర్వహిస్తామన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు


