WGL: గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ ఎల్లాపూర్, దేవన్నపేటతో పాటు పలు గ్రామాల్లో మిషన్ భగీరథ పైపులైన్ల మరమ్మతుల కారణంగా తాగునీటి ఇబ్బందులు తలెత్తాయి. దీంతో ఆదివారం స్థానికులు ‘డయల్ యువర్ ఎమ్మెల్యే’కు ఫోన్ చేయగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఆయా ప్రాంతాలకు వాటర్ ట్యాంకర్లను పంపించారు.
తెలంగాణ
'డయల్ యువర్ ఎమ్మెల్యే’కు స్పందన


