హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాత పెన్షన్ కోసం ఉద్యోగుల డిమాండ్

GDWL: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అయిజ మండలానికి చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆదివారం హైదరాబాద్‌కు తరలివెళ్లారు. అయిజలో నినాదాలు చేస్తూ సీపీఎస్ విధానంతో 2003 తర్వాత నియమితులైన ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని CPSEU మండల అధ్యక్షుడు వీరేష్ డిమాండ్ చేశారు.