హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం

GDWL: రాజోలి గ్రామంలో ఆదివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. సర్పంచ్ గంగిరెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో 3,500 మందికి పైగా లబ్ధిదారులకు కార్డులు అందించనున్నారు. ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.