KNR: చిగురుమామిడి మండలంలో మృతి చెందిన ఓ నిరుపేద కుటుంబ పెద్ద కుటుంబానికి స్థానిక వాట్సాప్ గ్రూప్ సభ్యులు అండగా నిలిచారు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. మృతుడి ఇద్దరు పిల్లలు దివ్యాంగులు కావడంతో కుటుంబానికి కొంత ఊరట కల్పించాలనే ఉద్దేశంతో ఈ సహాయం చేసినట్లు సభ్యులు తెలిపారు.
తెలంగాణ
నిరుపేద కుటుంబానికి వాట్సాప్ గ్రూప్ చేయూత


