హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వర్ష సూచన

KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పెద్దపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. 24వ తేదీ ఉదయం వరకు ఉరుములు, ఈదురుగాలులతో గంటకు 30–40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.