హైదరాబాద్: 28°C
క్రీడలు

గిల్‌కు అరుదైన ఘనత

శ్రీలంకతో రెండో టెస్టులో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టెస్టుల్లో 3,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన 28వ భారత బ్యాటర్‌గా నిలిచాడు. 43వ మ్యాచ్‌లో 77వ ఇన్నింగ్స్‌కు ఈ మార్క్ చేరుకున్నాడు. 43.53 సగటుతో 8 సెంచరీలు, 11 అర్ధసెంచరీలు చేశాడు. 26 ఏళ్ల 349 రోజుల వయసులో ఈ ఘనత సాధించి, భారత్‌లో నాలుగో అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు.