BDK: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 24 నుంచి 28వ తేదీ వరకు నిత్య కళ్యాణ వేడుకలు జరగవని ఈవో దామోదర్ రావు ఆదివారం తెలిపారు. ఈనెల 23నుంచి 28వరకు దేవస్థానంలో పవిత్రోత్సవాలు జరుగుతుండటంతో నిత్య కళ్యాణ వేడుకలు జరగవని ఆయన అన్నారు. తిరిగి ఈనెల 29న నిత్య కళ్యాణ వేడుకలు యధావిధిగా జరుగుతాయని అన్నారు కావున భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు
తెలంగాణ
రేపటి నుంచి నిత్య కల్యాణ వేడుకలు బంద్


