హైదరాబాద్: 28°C
తెలంగాణ

తెలంగాణలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమ్మె

PDL: తెలంగాణ వ్యాప్తంగా ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఈనెల 23 అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ప్రతి ఏటా రూ.12 వేల ఆర్థికసాయం, సంక్షేమబోర్డు ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని ఆటో జేఏసీ పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు వ్యాల హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరసన కొనసాగుతుందని తెలిపారు.