హైదరాబాద్: 28°C
తెలంగాణ

20 ఏళ్ల సమస్యకు పరిష్కారం.. గ్రామస్థుల హర్షం

NRML: తానూర్ మండలం బోరేగాం బాలాజీ గుట్టపై దాదాపు 20 ఏళ్లుగా ఉన్న విద్యుత్ సమస్యకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చొరవతో పరిష్కారం లభించింది. ఇటీవల గ్రామస్తులు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన అధికారులతో మాట్లాడి కేవలం మూడు రోజుల్లోనే ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయించి విద్యుత్ సరఫరా కల్పించారు. దీంతో భక్తులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.