హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుక్కల బెడద.. బెంబేలెత్తుతున్న ప్రజలు

JN: పట్టణంలోని పలు కాలనీలు, ప్రధాన రహదారులపై వీధి కుక్కల బెడద రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. గుంపులుగా సంచరిస్తూ వాహనదారులు, పాదచారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రాత్రి వేళల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల నియంత్రణకు మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని పట్టణవాసులు కోరారు.