BDK: సుజాతనగర్‌లోని మెయిన్ సెంటర్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని యూటర్న్ తీసుకుంటున్న ఆటో ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరి వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడ్డ వారిని 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు


