JN: జనగామలోని ఏకశిల బీఈడీ కళాశాలలో ఎస్ఎఫ్ఎ రాష్ట్ర స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, అధ్యక్షుడు రజనీకాంత్ ఎస్ఎఫ్ఎ జెండాను ఆవిష్కరించారు. భగత్‌సింగ్, చేగువేరా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యార్థి ఉద్యమాలు, విద్యార్థుల సమస్యలపై సమావేశంలో చర్చించారు. జిల్లా కార్యదర్శి సుమ, అధ్యక్షుడు లవకుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ
జిల్లాలో SFI రాష్ట్ర స్థాయి సమావేశం


