హైదరాబాద్: 28°C
తెలంగాణ

MRPS నూతన గ్రామ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

MHBD: మరిపెడ మండలం ఆనేపురంలో మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు MRPS నూతన గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల నాయకుడు మంద వెంకన్న మాదిగ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో అధ్యక్షుడిగా ఎల్లేష్ మాదిగ, ఉపాధ్యక్షుడిగా చిత్రాల ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా మంద మహేష్ ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 9న వరంగల్‌లో నిర్వహించనున్న MRPS బహిరంగ సభకు హాజరు కావాలని కోరారు.