హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండుగను శాంతియుతంగా జరుపుకోవాలి: SI

NGKL: మిలాద్ ఉన్ నబీ పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని SI కురుమూర్తి సూచించారు. ఆదివారం కల్వకుర్తి పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన శాంతి సంఘం సమావేశంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ షానవాజ్ ఖాన్‌తో పాటు పలువురు మత పెద్దలు పాల్గొన్నారు. పండుగ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు పరస్పర సహకారంతో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని ఎస్సై కోరారు.