హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షాభావంతో ఎండుతున్న పత్తి పంటలు

NGKL: ఎల్‌నినో ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సకాలంలో వర్షాలు కురవక పత్తి తదితర మెట్ట పంటలు ఎండిపోతున్నాయి. కల్వకుర్తి మండలంలోని జీడిపల్లి, వెంకటాపూర్, ఎల్లికట్ట, తోటపల్లి తదితర ప్రాంతాల్లో నీటి కొరతతో పత్తి పంటలు ఎండిపోతుండగా, కొందరు రైతులు స్ప్రింక్లర్ల ద్వారా పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.