హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈనెల 24న కెరీర్‌ గైడెన్స్‌పై అవగాహన'

ASR: పాడేరు కలెక్టరేట్‌ లో ఈనెల 24న ఉదయం 11 గంటలకు కెరీర్‌ గైడెన్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్‌ డా సీహెచ్‌ కేశవరావు సూచించారు. విద్యార్థులు కార్యక్రమానికి హాజరై ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై అవగాహన పొందాలని కోరారు.