హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతులు రోడ్డు ఎక్కే పరిస్థితి

KMM: తల్లాడ (M) గంగిదేవిపాడు సొసైటీ కార్యాలయానికి శనివారం రైతులు తాళం వేసి నిరసన తెలిపారు. ఎరువుల ఆన్లైన్ విధానంలో సాంకేతిక లోపంతో 6రోజులుగా గోడౌన్లో నిల్వ ఉన్న ఎరువులను వెంటనే రైతులకు అందించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.