హైదరాబాద్: 28°C
తెలంగాణ

పారదర్శకంగా అంగన్వాడీ టీచర్ల ఎంపిక

KMM: జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, సహాయకుల పోస్టుల భర్తీకి చేపట్టిన ఎంపిక ప్రక్రియ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిగా పారదర్శకంగా నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలత లెనినా తెలిపారు. దరఖాస్తుదారులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, తమకు పరిచయాలు ఉన్నాయని ఎవరైనా చెప్పినా నమ్మవద్దని హెచ్చరించారు.