హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ధర్మవరం వద్ద రహదారిపై మట్టి తొలగించాలి'

NDL: డోన్‌–జలదుర్గం రహదారిలో ధర్మవరం సమీపంలో గుంతలు ఏర్పడిన చోట నెల రోజుల క్రితం రోడ్డుపై మట్టి పోశారని, ఇప్పటికీ తొలగించలేదని సీపీఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ జిల్లా నాయకుడు రంగ శనివారం తెలిపారు. రైతులు పంటలను మార్కెట్‌కు తరలించే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వెంటనే మట్టి తొలగించాలని ఆర్‌అండ్‌బీ ఏఈకి వినతిపత్రం అందజేశారు.