హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బైక్‌ను ఢీకొన్న కారు.. వ్యక్తికి గాయాలు

ప్రకాశం: ద్విచక్ర వాహనం కారు ఢీకొన్న సంఘటనలో ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. ఈ సంఘటన బల్లికురవ మండలం వైదన గ్రామం హైవే వద్ద ఆదివారం చోటుచేసుకుంది. అతి వేగంతో కారును నడపడంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ప్రమాదంలో గాయపడిన ద్విచక్ర వాహనదారుడుని 108 లో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందజేస్తున్నారు.