హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం బ్యారేజీ వద్ద చేపల వలలో మృతదేహం.!

NTR: ప్రకాశం బ్యారేజీ దిగువన జాలర్ల వలలో శనివారం యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు మృతుడిని కృష్ణలంకకు చెందిన బైక్ మెకానిక్ కొండారెడ్డి (23)గా గుర్తించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. దహన సమయంలో కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు.