హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు శిరగం పంచాయితీలో పీజీఆర్ఎస్

ASR: అరకులోయ మండలం, శిరగం పంచాయితీ కేంద్రంలో ఈ నెల 24న పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ వీసం ప్రసాద్, తాహశీల్దార్ రాజా శ్రీధర్ తెలిపారు. ఈ పీజీఆర్ఎస్ లో ప్రజలు తమ, గ్రామ సమస్యలను తెలపాలని కోరారు. మండల స్ధాయి అన్ని శాఖల అధికారులు విధిగా హాజరు కావాలని ఆదేశించారు. శిరగం పీడీఓ, స్వర్ణ గ్రామ సిబ్బంది పీజీఆర్ఎస్ పై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.