హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వ్యాపారి ఇంట్లో చోరీ.. రూ.లక్ష నగదు అపహరణ

GNTR: గుంటూరు నవభారత్‌నగర్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి గణేశ్‌ ఇంట్లో చోరీ జరిగింది. ఆయన తిరుపతికి వెళ్లిన సమయంలో దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేశారు. 329 గ్రాముల బంగారం, 650 గ్రాముల వెండి, రూ.లక్ష నగదు అపహరణకు గురైనట్లు తెలిపారు. సమీప బంధువు ఆంజనేయులుపై అనుమానం ఉందని పేర్కొనడంతో పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.