NRPT: మక్తల్ మండలం పంచదేవ్‌పహాడ్‌లో డ్రైనేజీలు లేక మురుగు రహదారికి ఇరువైపులా ప్రవహిస్తోంది. అక్కడ పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు పెరిగి అపరిశుభ్రంగా మారాయి. ఇరువైపులా కాలువలు నిర్మించాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని గ్రామస్థులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కాలువలు నిర్మంచాలని స్థానికులు కోరారు.
తెలంగాణ
కాలువలు లేక.. రోడ్డెక్కుతున్న మురుగు నీరు


