KDP: ఎర్రగుంట్ల మండల సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 25న మంగళవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు MPDO వెంకటరమణయ్య తెలిపారు. MPDO కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో మండలంలోని వివిధ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
25న మండల సర్వసభ్య భేటీ


