హైదరాబాద్: 28°C
క్రీడలు

ఇప్పటికీ ఆ నిర్ణయం సరైంది కాదు: ఆకాశ్ చోప్రా

గిల్‌కు డిప్యూటీగా కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేయడంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో గిల్‌ తర్వాత సారథి అయ్యే అవకాశం ఉన్నందున, యువ ఓపెనర్‌కు కాస్త సమవయస్కుడిని వైస్‌ కెప్టెన్‌గా నియమిస్తే బాగుండేదన్నాడు. రాహుల్ నైపుణ్యాలను తక్కువ చేయడం లేదని, కానీ ఇద్దరి మధ్య ఏడెనిమిదేళ్ల వయసు తేడా ఉందని పేర్కొన్నాడు.