హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసాపురంలో పోలీసుల ‘వార్డు నిద్ర’

W.G: నరసాపురం 31వ వార్డులో శనివారం రాత్రి పోలీసుల ఆధ్వర్యంలో 'వార్డు నిద్ర' కార్యక్రమం నిర్వహించారు. టౌన్ SI పి.ప్రేమ్ రాజు పాల్గొని చట్టాలపై ప్రజలకు అవగాహణ కల్పించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజల పాత్ర కీలకమని, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాలు, మహిళా చట్టాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు.