హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బంగారం కోసమే హత్య చేశారా..?

SKLM: నరసన్నపేటలో ఈనెల 17న అదృశ్యమైన చింతు చిన్నమ్మడు (70) ఓ మూటలో శవమై కనిపించారు. జలుమూరు(M) అల్లాడపేటకు చెందిన ఆమె ఒంటిపై 10తులాలకుపైగా బంగారంతో ఓ ఫంక్షన్‌కు వెళ్లారు. తర్వాత నరసన్నపేటలో ఓ మహిళా లాయర్‌ను కలిసి అక్కడి నుంచే కుమారుడితో ఫోన్లో మాట్లాడారు. తర్వాత ఆమె ఆచూకీ తెలియరాలేదు. పిండ్రువాడ సమీపంలో శనివారం మృతదేహాన్ని గుర్తించారు.