హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి'

VZM: విజయనగరం రైల్వేస్టేషన్ లో జీఆర్పీ ఎస్సై వి. బాలాజీరావు, సిబ్బందితో రైల్లో ప్రయాణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిన్న రాత్రి అవగాహన కల్పించారు. ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తోటి ప్రయాణికులు ఇచ్చిన పదార్థాలు తీసుకోరాదని కోరారు. రైల్లో ఫుట్ బోర్డ్ ప్రయాణం చేయకూడదన్నారు. ప్రయాణ సమయంలో విలువైన వస్తువులు ధరించకూడదని పేర్కొన్నారు.