WGL: శ్రావణ మాస ఏకాదశి సందర్భంగా ఆదివారం వరంగల్ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి అర్చకులు తెల్లవారుజామున విశేషాభిషేకాలు నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలతో అమ్మవారిని సర్వాంగసుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ప్రత్యేక పూజల్లో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
తెలంగాణ
శ్రావణ ఏకాదశి.. భద్రకాళి అమ్మవారికి విశేష పూజలు


