హైదరాబాద్: 28°C
తెలంగాణ

తిమ్మాపూర్‌లో వృద్ధురాలి హత్య

JGL: జగిత్యాల రూరల్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఆదివారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బడుగు రామక్క అనే వృద్ధురాలు సఫాయి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఉదయం యథావిధిగా పనికి వెళ్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై దాడి చేసి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.